గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి కన్నుమూత
దివంగత సినీ నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి (81) తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. శివకామసుందరి మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.
శుక్రవారమే అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. రామభక్తురాలైన ఆమె.. మూడున్నరకోట్ల రామకోటి రాసినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా.. 2019లో గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో కన్నుమూయగా.. అప్పట్నుంచి ఇప్పటివరకూ.. శివకామసుందరి తన కుమారుడు సుబ్బారావు నివాసంలోనే ఉంటున్నారు. హన్మకొండలో పుట్టిన శివకామసుందరికి 1961లో మారుతీరావుతో వివాహమైంది.