1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 4 మార్చి 2017 (03:33 IST)

శశికళ సంతకం ఉంటే రెండాకుల చిహ్నం రద్దు: గందరగోళంలో ఎంఎల్ఏలు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక ఎంతమాత్రం చెల్లదని ఆ పార్టీ మాజీ న్యాయ సలహాదారు, సీనియర్‌ న్యాయవాది జ్యోతి అభిప్రాయపడ్డారు. 2008లో అన్నాడీఎంకే వదిలి డీఎంకేలో చేరిన జ్యోతి ప్రస్తుతం మాజీ ము

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక ఎంతమాత్రం చెల్లదని ఆ పార్టీ మాజీ న్యాయ సలహాదారు, సీనియర్‌ న్యాయవాది జ్యోతి అభిప్రాయపడ్డారు. 2008లో అన్నాడీఎంకే వదిలి డీఎంకేలో చేరిన జ్యోతి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గంలో ఉన్నారు. గురువారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ పార్టీ తీసుకున్న క్రమశిక్షణ చర్య నుంచి శశికళ బయటపడినా అంతకు ముందు పార్టీ సభ్యురాలిగా ఆమె గడిపిన రోజులు రద్దయినట్లేనని చెప్పారు. పార్టీలో ఆమె మరలా చేరిన రోజు నుంచి ఐదేళ్లపాటూ ఆమె సభ్యురాలిగా కొనసాగినట్లయితేనే ప్రధాన కార్యదర్శిగా పోటీకి అర్హురాలు కాగలరని తెలి పారు.
కాబట్టి ప్రధాన కార్యదర్శిగా ఆమె నియామకం, ఆమె తీసుకున్న నిర్ణయాలు చెల్లవని చెప్పారు. అంతేగాక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల బీఫారంలో శశికళ సంతకం, రెండాకుల చిహ్నం కేటాయింపు చట్ట ప్రకారం చెల్లదని ఆయన అన్నారు. దీన్ని ధిక్కరించి రెండాకుల చిహ్నాన్ని కేటాయించిన పక్షంలో అది రద్దయ్యే అవకాశం ఉందని చెప్పారు. రెండాకుల చిహ్నం కేటాయింపు సమస్యపై సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు.
 
ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నెరవేర్చేందుకు సర్వసభ్య సమావేశం ద్వారా ఒకరిని ఎన్నుకుని,  అతని   నియామకంపై ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం పొందినట్లయితే బీఫారంలో సంతకం పనికి వస్తుందని ఆయన చెప్పారు. టీటీవీ దినకరన్ మే ఖరారు కాని పరిస్థితిలో ఉప ప్రధాన కార్యదర్శి కావడం కుదరదని అన్నారు. పార్టీలో జయలలిత తనకు ఎంతో ప్రాధాన్యతనివ్వడం శశికళకు నచ్చలేదని తెలిపారు. శశికళ తదితరులకు ఏమికావాలో ఇచ్చి పంపివేయండి, దగ్గరే ఉంచుకోవద్దని జయలలితకు చెప్పానని ఆయన తెలిపారు. అయితే తన సలహాను జయ ఖాతరు చేయని ఫలితంగా తనను తానే కాపాడుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఎన్నికల కమిషన్ కు హక్కులేదు  పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నందున ఎన్నికల కమిషన్ కు జోక్యం చేసుకునే హక్కు లేదని అన్నాడీఎంకే లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి, ఎంపీ నవనీతకృష్ణన్  అన్నారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శి ఎంపిక పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారం, ఇందులో ఎన్నికల కమిషన్  లేదా న్యాయస్థానం జోక్యం చేసుకోలేరని ఆయన చెప్పారు.