కరోనా రక్కసి కొంపముంచేస్తోంది.. అనాథలుగా మారిన 577మంది చిన్నారులు
కరోనా రక్కసి కొంపముంచేస్తోంది. కోవిడ్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలి ఛిద్రమైపోతున్నాయి. తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులు అనాథలుగా మారుతున్న అత్యంత విషాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు వందల సంఖ్యలో వున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ వల్ల తల్లితండ్రులు చనిపోవడంతో సుమారు 577 మంది చిన్నారులు అనాథలుగా మారారని స్మృతి ఇరానీ తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మంగళవారం (మే 25.5.2021)వరకు ఈ నివేదిక ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన పిల్లలను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలు ఇచ్చిన సమాచారం మేరకు 577 మంది చిన్నారులు అనాథలయ్యారని తెలిపారు. జిల్లా అధికారులు అనాథలైన పిల్లల సంరక్షణ చూసుకుంటారని అన్నారు.
తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు నిమహన్స్ రెడీగా ఉందన్నారు. ఇలాంటి చిన్నారులను చూసుకునేందుకు ప్రభుత్వం వద్ద ఎటువంటి నిధుల కొరత లేదని మంత్రి స్పష్టంచేశారు.