ఏపీలో 82 మందిని పొట్టనబెట్టుకున్న కరోనావైరస్

corona virus
ఐవీఆర్| Last Modified సోమవారం, 17 ఆగస్టు 2020 (21:33 IST)
రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు తగ్గినప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 82 మందిని పొట్టనబెట్టుకుంది ఈ వైరస్. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 13 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది మృతి చెందినవారిలో వున్నారు.

కాగా ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,93,714 పాజిటివ్ కేసులకు గాను 2,06,205 మంది డిశ్చార్జ్ అయ్యారు. 2,732 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 84,777గా వున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.దీనిపై మరింత చదవండి :