కరోనావైరస్ నుండి విముక్తి పొందిన ఐశ్వర్యారాయ్, ఆరాధ్య
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె ఆరాధ్యకు కరోనా పాజిటివ్ రావడంతో వారం రోజుల కిందట హోమ్ క్వారంటైన్ నుంచి హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వారికి చేసిన టెస్టులో వారిద్దరికి నెగటివ్ వచ్చింది. దీంతో వారిద్దరూ సోమవారం మధ్యాహ్నం ముంబయి లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇదే విషయాన్ని ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. తన భార్యతో పాటు కూతురుకి కూడా నెగటివ్ వచ్చిందని, దాంతో వారిని డశ్చార్జ్ చేసారని తెలిపారు. కానీ తను, తన తండ్రి బిగ్ బీ అమితాబ్‌లు ఇంకా హాస్పిటల్లో ఉన్నామని, మరికొన్ని రోజులు వైద్యుల సమక్షంలో ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు త్వరలో బిగ్ బీ అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లు కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.