సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 మే 2021 (20:20 IST)

ఏపీలో కరోనా విజృంభణ.. 20వేలకు పైగా కేసులు 99మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మంగళవారం 20 వేలపైనే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,253 నమూనాలను పరీక్షించగా 21,320 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 14,75,372 కి చేరింది. 24 గంటల్లో కరోనాతో 99 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో 9,580 మంది మృతి చెందారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,501 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 12,54,291 మంది రికవరీ అయ్యారు. ఇక కొత్తగా చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో పది మంది చొప్పున కరోనాతో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు. 
 
అంతేకాకుండా అనంతపురం, గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు చొప్పున, నెల్లూరు ఐదుగురు, కడప ఇద్దరు కరోనాతో మృతి చెందారు.