శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (10:55 IST)

దేశంలో 6,984 కేసులు.. కేరళలోనే 3,377 కరోనా కేసులు

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. కానీ, కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ కేసుల నమోదులో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. గడిచిన 24 గంటల్లో కూడా ఏకంగా 3,344 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
వీటితో కలుపుని దేశ వ్యాప్తంగా మొత్తం 6,984 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్రవైద్య ఆరోగ్య శాఖ విడుదలచేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఈ వైరస్ సోకి గత 24 గంటల్లో 247మంది చనిపోగా, 8168 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మృతుల్లో కేరళ రాష్ట్రంలో 28 మంది ఉన్నారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 87562 మంది యాక్టివ్ కేసులు ఉండగా వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌‍లలో చికిత్స పొందుతున్నారు. అలాగే, కరోనా నుంచి దేశం ఇప్పటివరకు 3,41,46,931 మంది కోలుకోగా, 4,76,135 మంది చనిపోయారు. అలాగే, 1,34,61,14,483 మందికి కరోనా వ్యాక్సిన్ డోస్‌లను వేశారు.