Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... తెలంగాణాలో తాజా పరిస్థితి...

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 2 మార్చి 2021 (10:55 IST)
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు.. దేశంలో గత 24 గంటల్లో 12,286 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేస‌మ‌యంలో 12,464 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 91 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,98,921 మంది కోలుకున్నారు. 1,68,358 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,48,54,136 మందికి వ్యాక్సిన్ వేశారు.
     
కాగా, దేశంలో సోమవారం వరకు మొత్తం 21,76,18,057 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,59,283 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
ఇదిలావుంటే, తెలంగాణలో కొత్త‌గా 163 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం, గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 157 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,086కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,95,544 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1635 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,907 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 774 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. 

అన్నీ చూడండి

Jailer 2 Update: జైలర్ 2 ఫస్ట్ సింగిల్ తేదీని ప్రకటించిన సన్ పిక్చర్స్

అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ది రెడ్ బ్యాగ్ ఆకట్టుకుంటుంది : హరికృష్ణ సోమిశెట్టి

Mega158: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న భారీ అప్‌డేట్

NTR: ఇటు ఎన్.టి.ఆర్.కు ఫిజియో థెరపీ - అటు డ్రాగన్ డేట్ గురించి అప్ డేట్

Snadeep: తుది దశకు చేరుకున్న సిగ్మా పోస్ట్ ప్రొడక్షన్, గాంధీ జయంతికి డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments