దేశంలో 61 లక్షలు దాటిపోయిన కరోనా కేసులు...

icmr
ఠాగూర్| Last Updated: మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (10:50 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య 61 లక్షలు దాటిపోయింది. గత 24 గంటల్లో దేశంలో 70,589 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 61,45,292 కి చేరింది.

అలాగే, గ‌త 24 గంట‌ల సమయంలో 776 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 96,318 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 51,01,398 మంది కోలుకున్నారు. 9,47,576 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

కాగా, దేశంలో సోమవారం వరకు మొత్తం 7,31,10,041 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,42,811 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, తెలంగాణ‌లో కరోనా కేసుల తాజా వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం వెల్లడించింది. దీని ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,072 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,259 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,89,283కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,58,690 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,116కు చేరింది. ప్రస్తుతం 29,477 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 283, రంగారెడ్డి జిల్లాలో 161 కేసులు నమోదయ్యాయి.దీనిపై మరింత చదవండి :