మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (10:39 IST)

దేశంలో కొత్తగా 41,322 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఒక్కరోజే 485మంది మృతి

దేశంలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 41,322 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,51,110కు చేరింది. ఇందులో 4,54,940 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 87,59,969 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,36,200 మంది మరణించారు. 
 
కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల 485 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. కొత్తగా 41,452 మంది కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారని తెలిపింది.
 
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. ఈ రాష్ట్రాల్లో గత 24 గంటల్లో 23 నుంచి 85 మంది బాధితులు చనిపోయారని పేర్కొంది. శుక్రవారం మహారాష్ట్రలో 6,185 కొత్త కేసులు నమోదవగా, ఢిల్లీలో 5,482 మంది కరోనాబారినపడ్డారు. రాష్ట్రంలో 98 మంది చనిపోయారు.