బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 6 నవంబరు 2020 (20:17 IST)

ఏపీలో కోవిడ్ 19 తగ్గుముఖం, కొత్త కేసులు 2,410

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కోవిడ్ 19 కేసులు అదుపులోకి వస్తున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 79,601 శాంపిళ్లను పరీక్షించగా వారిలో 2,410 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. 
 
మరోవైపు కరోనా కారణంగా కృష్ణా జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, అనంతపూర్ జిల్లాలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు, కడప- పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 
 
గత 24 గంటల్లో 2,452 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 85,07,230 శాంపిళ్లను పరీక్షించడం జరిగిందని ఏపీ హెల్త్ బులిటెన్లో వెల్లడించారు.