గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (12:51 IST)

కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి...

Guatemala
గ్వాటెమాలాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు అలెజాండ్రో గ్యామెట్టే స్వయంగా తెలిపారు. మధ్య అమెరికా దేశంలో పర్వత ప్రాంతాలు కూలి ఇళ్లపై పడటం వల్ల.. 25 మంది మృతి చెందారు. 
 
హ్యుహ్యుటెనాంగోలో రెండు చోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల 12 మంది మరణించారు. గత కొద్ది రోజులుగా ఆ దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. ఫలితంగా ప్రమాదాలు సంభవించినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో అక్కడక్కడా చిన్న కొండచరియలు విరిగిపడగా.. 20 మంది చనిపోయారు.