కరోనా వైరస్ రోగి తొలి మరణం... కర్నాటకలో 76 యేళ్ల వృద్ధుడు...

coronavirus death
ఠాగూర్| Last Updated: బుధవారం, 11 మార్చి 2020 (16:08 IST)
రాష్ట్రంలోనేకాకుండా దేశంలో తొలి కరోనా వైరస్ మృతి కేసు నమోదైంది. కర్నాటక రాష్ట్రంలో 76 యేళ్ల వృద్ధుడు కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ కన్నుమూశాడు. ఇది ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో నమోదైన తొలి కరోనా మృతి కేసు కావడం గమనార్హం.

మృతుని పేరు మహ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ. వయస్సు 76 యేళ్లు. కలబుర్గి ప్రాంతానికి చెందిన హుస్సేన్.. కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ఆయన నుంచి రక్తం శాంపిల్స్ సేకరించి వైరాలజీ పరిశోధనాశాలకు పంపించారు. అయితే, ఆ రక్తపరీక్షల ఫలితాలు రాకముందే హుస్సేన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఈయన ఇటీవల సౌదీ అరేబియా నుంచి భారత్ వచ్చాడు. కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో అతడిని కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే, బ్లడ్ శాంపిల్స్ తాలూకు రిపోర్టులు బెంగళూరు ల్యాబ్ నుంచి రావాల్సి ఉంది. ఈలోపే సిద్ధిఖీ కన్నుమూయడంతో అతడి మరణానికి కారణం ఏంటన్నది తెలియరాలేదు. ఒకవేళ సిద్ధిఖీ కరోనా కారణంగా మరణిస్తే భారత్‌లో ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడిన తొలి వ్యక్తి అవుతాడు.దీనిపై మరింత చదవండి :