శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (09:11 IST)

కమ్మేసిన కరోనా.. బయటకెళ్లి ఇంట్లోకి వచ్చేముందు ఏం చేయాలి?

ఇపుడు కరోనా వైరస్ గుప్పెట్లో ప్రపంచం ఉంది. ఈ వైరస్ మహమ్మారినుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలన్ని పెద్ద పోరాటమే చేస్తున్నాయి. కొన్ని దేశాలు ఏకంగా లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నిత్యావసరాలకు మాత్రమే ప్రజలను బయటకు అనుమతిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో లేకా కూరగాయల కోసమో, నిత్యావసరాల కోసమో బయటకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చేటపుడు ఏం చేయాలో వైద్యులను అడిగితే ఇలా చెబుతున్నారు. 
 
ఏ కారణం వల్ల బయటికి వెళ్లినా రాగానే కాళ్లూ, చేతులు శుభ్రం చేసుకోకుండా ఇంటి లోపలికి రావొద్దని చెబుతున్నారు. గేటు బయటే సబ్బుతో కాళ్లూ, చేతులు కడుక్కుని ముందుగా వాష్‌ రూమ్‌లోకే వెళ్లాలని సలహా ఇస్తున్నారు. ఆ తర్వాత మీ బట్టలు, చెప్పులను కూడా శుభ్రం చేయాలంటున్నారు.
 
బయటకు వెళ్లేటపుడు ధరించిన బట్టలన్నీ తీసి బ్లీచింగ్‌ పౌడర్‌ ద్రావణం గానీ, డిటర్జెంట్‌ వాటర్‌లోగానీ ఆ దుస్తులను వేసేయాలి. ఒంటి మీదో, జుట్టు మీదో వైరస్‌ ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అప్పుడే ఇంట్లోకి వెళ్లాలని సలహా ఇస్తున్నారు. 
 
ఇవి పాటించకపోవడం వల్లే అత్యధిక సంఖ్యలో వృద్ధులు ఉన్న ఇటలీలో పెను విపత్తు సంభవించిందని వారు గుర్తుచేస్తున్నారు. ఈ దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపించడానికి కూడా కారణం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ముఖ్యంగా యువతీయువకులు ఇల్లు కదలకండి. తప్పనిసరై బయటికి వెళ్లాల్సి వస్తే రక్షణ చర్యలు పాటించాలని సలహా ఇస్తున్నారు.