ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (13:54 IST)

కొత్త రకం కరోనా 'డెల్టాక్రాన్' - బ్రిటన్‌లో గుర్తింపు

కరోనా వైరస్ మరో కొత్తరూపం ఒకటి వెలుగు చూసింది. దీన్ని డెల్టాక్రాన్‌గా గుర్తించారు. బ్రిటన్‌లో గుర్తించారు. కరోనా రెండో దశ వ్యాప్తిలో డెల్టా రూపంలోనూ, మూడో దశలో ఒమిక్రాన్ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడిన విషయం తెల్సిందే. ఇపుడు ఈ రెండు వేరియంట్ల సమ్మేళనంతో డెల్టాక్రాన్ పేరుతో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ డెల్టాక్రాన్ వైరస్‌ను తొలిసారి సైప్రస్‌లో గుర్తించారు. 
 
డెల్టా, ఒమిక్రాన్ లక్షణాలు డెల్టాక్రాన్‌ కేసుల్లో ఉన్నట్టు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ కేసులను నిశితంగా అధ్యయనం చేస్తున్నట్టు తెలిపింది. ఇన్ఫెక్షన్ తీవ్ర ఏ స్థాయిలో ఉన్నదీ, లక్షణాలు తీవ్రత గురించి వివరాలు వెల్లడించలేదు. కరోనా డెల్టా వేరియంట్‌ కేసులు ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యల నమోదైన విషయం తెల్సిందే.