శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (13:06 IST)

కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు యత్నం.. ప్రయాణికుడి తల పగులగొట్టిన ఫ్లైట్ అటెండర్

ఓ విమాన ప్రయాణికుడు విమానంలో నానా రభస సృష్టించాడు. పైలెట్లు ఉండే కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అందుకు విమాన సిబ్బంది నిరాకరించడంతో నానా గొడవ చేశాడు. దీంతో ఫ్లైట్ అటెండర్‌కు చిర్రెత్తుకొచ్చింది. అంతే ఆ ప్రయాణికుడి తల పగులగొట్టాడు.
 
దీంతో అతను స్పృహతప్పి కిందపడిపోయాడు. రక్తం ధారగా కారిపోయింది. ఈ ఘటన అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ నుంచి వాషింగ్టన్‌కు బయలుదేరిన విమానంలో ఆదివారం జరిగింది. 
 
ఈ ఘటన వల్ల విమానాన్ని దారి మళ్లించి కాన్సాస్‌లో దించారు. అక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ప్రయాణికుడుని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.