శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: శనివారం, 23 మే 2020 (19:26 IST)

ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్, వైద్యులు జె.ఎన్ పాండేను పొట్టనబెట్టుకున్న కరోనా

కరోనా వైరస్ మరో ప్రఖ్యాత వైద్యుడిని పొట్టనబెట్టుకుంది. ఎయిమ్స్‌ ఢిల్లీ డైరెక్టర్‌, ప్రపంచ ప్రఖ్యాత పల్మనాలజిస్ట్‌, డాక్టర్‌ జేఎన్‌ పాండే కరోన వైరస్‌ సోకడంతో కన్నుమూశారు.
 
ఎయిమ్స్‌లో మెడిసన్‌ విభాగానికి ఆయన హెడ్‌గా కూడా పనిచేశారు. ఢిల్లీలో ఊపిరితిత్తులకు సంబంధించి ఏ అంశమైనా డాక్టర్‌ జేఎన్‌ పాండేదే తుది మాట. వ్యాధిని పసిగట్టడంలో ఆయనకు మించినవారు లేరంటారు. అంతటి నిష్ణాతులైన పాండే కరోనాతో మృతి చెందడంపై సహచర డాక్టర్లు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.