శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 మే 2021 (13:01 IST)

వ్యాక్సినేషన్‌ స్లాట్ కోసం అండర్‌ 45 ఇన్‌, ఎలా ఆన్ చేయాలంటే?

కరోనా దేశంలో విజృంభిస్తుండటంతో 18 నుండి 44 ఏళ్లు వారు కూడా తాజా వ్యాక్సినేషన్‌లో ప్రక్రియలో అర్హులుగా కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఇందుకు ముందస్తు నమోదు ప్రక్రియ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌ కోవిన్‌ లేదా ఆరోగ్య సేతు యాప్‌లో ముందస్తుగా టీకా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో అర్హులంతా టీకా కోసం తమ పేర్లు నమోదు చేసుకోగా.. స్లాట్‌ మాత్రం దొరకడం లేదు. దీంతో చాలా మంది వ్యాక్సిన్‌ ఔత్సాహికులు నిరుత్సాహానికి గురౌతున్నారు. అలాంటి వారికి సహాయం చేసేందుకు పలువురు మందుకు వచ్చారు.
 
అలాంటి వాటిలో ఒకటి అండర్‌. 45. ఇన్‌ అనే ఇంటర్నెట్‌ ఫ్లాట్‌ఫాం. దీన్ని చెన్నైకు చెందిన ఓ వ్యక్తి అభివృద్ధి చేశారు. ఇది టెలిగ్రామ్‌ ద్వారా సేవలందిస్తుంది. సెర్చ్‌ ఇంజన్‌లోకి వెళ్లి అండర్‌. 45. ఇన్‌ దీనిలోకి వెళ్లి రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని, జిల్లాను ఎంపిక చేసుకోగానే.... టెలిగ్రామ్‌ ఛానల్‌లోకి ఎంటర్‌ అవుతారు.
 
అందులో ఆధునీకరించిన స్లాట్‌ వివరాల సమాచారాన్ని అందిస్తోంది. జితబ్‌. ఇన్‌ అనే మరో ఫ్లాట్‌ ఫాం కూడా ఈ మెయిల్‌ ద్వారా స్లాట్‌ వివరాలను సూచిస్తోంది. అదేవిధంగా ఆన్‌లైన్‌ పేమెంట్‌ సంస్థ పేటియం కూడా మొబైల్‌ ఫైండర్‌ను పొందుపరిచింది. మై గవర్నమెంట్‌ కరోనా హెల్ప్‌ డెస్క్‌' అనే ఫ్లాట్‌ ఫాం కూడా నవీనకరించిన స్లాట్‌ వివరాలను వాట్సాప్‌ ద్వారా పొందవచ్చు.