18 ఏళ్లు నిండిన వారికి 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్
దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం వెల్లడించారు.
CoWin యాప్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఆ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన అందరూ రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్లు గతంలోలాగానే ఉంటాయని స్పష్టం చేశారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి మరిన్ని ప్రభుత్వ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు. కాగా, ప్రస్తుతం 45 యేళ్లు నిండినవారికి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెల్సిందే.