1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (23:21 IST)

చేతిలో డబ్బుండి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇన్‌కమ్‌ స్కీమ్ బెస్ట్

చేతిలో డబ్బుండి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీసుకు వెళ్ళండి. పోస్టాఫీస్‌ పలురకాల స్కీమ్‌లు అందిస్తోంది. వీటిల్లో మంత్లి ఇన్‌కమ్‌ స్కీమ్‌ కూడా ఒకటి ఉంది. ఈ స్కీమ్‌లో చేరితే ప్రతినెల డబ్బులు వస్తాయి. సింగిల్‌ లేదా జాయింట్‌ అకౌంట్‌ తెరవచ్చు. మీరు కనీసం రూ.1000 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం ఉంది.
 
అయితే వెయ్యి రూపాయలు పెడితే మీకు వచ్చే లాభం ఏమి ఉండదు. పోస్టాఫీసు నుంచి నెల ఆదాయం స్కీమ్‌లో మీరు గరిష్ఠంగా రూ.4.5 లక్షల వరకు అన్వెస్ట్‌ చేయవచ్చు. జాయింట్‌ అకౌంట్‌ అయితే రూ.9 లక్షలు కూడా డిపాజిట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఒకేసారి డబ్బులు పెట్టాలి. తర్వాత ప్రతి నెల రాబడి పొందే అవకాశం ఉంటుంది. రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు, సీనియర్‌ సిటిజన్స్‌కు ఈ స్కీమ్‌ అనుగుణంగా ఉంటుంది.
 
ఈ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో చేరాలంటే.. ఐడీ ఫ్రూప్‌, అడ్రస్‌ ఫ్రూప్‌, రెండు పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటోలు వంటికి అందజేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసులో ఫారం నింపి మంత్లి ఇన్‌కమ్ ఖాతాను తెరుచుకోవచ్చు. మీరు పెట్టిన ఇన్వెస్ట్‌ మెంట్‌ డబ్బులను ఐదేళ్ల తర్వాత వెనక్కి తీసుకోవచ్చు. అంత వరకు ప్రతినెలా వడ్డీ డబ్బులు వస్తుంటాయి.
 
ఉదాహరణకు… మీరు పోస్టాఫీసులో జాయింట్‌ మంత్లి ఇన్‌కమ్‌ స్కీమ్‌ అకౌంట్‌ను తెరిచి అకౌంట్‌లో రూ. 9 లోల డిపాజిట్‌ చేశారని అనుకుంటే.. మీకు ఏడాదికి రూ.59,400 వేల వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ.5 వేల చొప్పున వస్తాయన్నమాట. ప్రస్తుతం ఈ స్కీమ్‌ రూ.6.6 వడ్డీ లభిస్తోంది.