శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (16:23 IST)

గర్భ నిరోధక సాధనాల కొరత.. అవాంఛిత గర్భాలు

కోవిడ్-19 వలన ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల 70 లక్షల మంది మహిళలకి గర్భ నిరోధక సాధనాల కొరత ఏర్పడ వచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. గర్భ నిరోధక సాధనాలు, మందుల కొరత ఏర్పడితే ఫిలిప్పీన్స్‌లో అవాంఛిత గర్భాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

కోవిడ్-19 కారణంగా కొన్ని కోట్ల మంది మహిళలకి గర్భ నిరోధక సాధనాలు, మందులు లభించకపోవచ్చని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్‌పీఏ) హెచ్చరించింది.
 
ప్రపంచంలో అత్యల్ప ఆదాయం ఉన్న 114 దేశాలలో 4 కోట్ల 70 లక్షల మంది మహిళలకి గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండకపోవచ్చని యూఎన్ఎఫ్‌పీఏ పేర్కొంది.

లాక్ డౌన్ మరో 6 నెలల పాటు కొనసాగితే 70 లక్షల మంది మహిళలు అవాంఛిత గర్భాలు దాల్చే ప్రమాదం ఉందని నివేదిక తెలిపింది. లాక్ డౌన్ పొడిగిస్తున్న ప్రతి మూడు నెలలకి మరో 20 లక్షల మంది మహిళలకి ఆధునిక గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండకపోవచ్చు.