సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జులై 2020 (22:35 IST)

ధారావిలో పదివేలు, మహారాష్ట్రలో ఒక్కరోజే 5,537 కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో బుధవారం భారీ సంఖ్యలో కేసులు నమోదైనాయి. బుధవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 5,537 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే కొత్తగా నమోదైన కరోనా కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,80,298కి చేరింది. 
 
ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 79,075 కాగా.. 93,154 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అంతేగాకుండా మహారాష్ట్రలో కరోనా సోకిన వారిలో ఇవాళ 198 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 8053కు చేరింది. 
 
అలాగే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావి ప్రాంతంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజూ పదివేల కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కూడా 10వేల పైచిలుకు కరోనా కేసులు నమోదైనాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసులు 2,282కు చేరినట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు.