బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: గురువారం, 6 మే 2021 (20:49 IST)

ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం నూతన కోవిడ్‌ మార్గదర్శకాలు: భారతీయ రైల్వే

ప్రయాణికుల భద్రత మెరుగుకు నిరంతరం కృషి చేస్తున్న భారతీయ రైల్వే కోవిడ్‌ 19 వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత దశలో కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి అనేక ప్రత్యేక చర్యను తీసుకుంటుంది. రిజర్వేషన్‌ మరియు రిజర్వేషన్‌ లేని ప్రయాణికుల సర్వీసును ప్రారంభించిన నాటి నుండి ప్రయాణికుల వారి స్వంత భద్రతా మరియు తోటి ప్రయాణికులను భద్రతను దృష్టిలో పెట్టుకొని కోవిడ్‌ నిబంధనలన్నింటినీ పాటించాలని రైల్వే తరుచూ ప్రయాణికులకు సూచిస్తూ ఉంది.
 
ప్రస్తుత మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని, ప్రయాణికుల భద్రత మెరుగుకు మరియు వైరస్‌ నియంత్రణకు నూతనంగా మరిన్ని కోవిడ్‌ నిబంధనలను అమలు చేస్తుంది. దిగువ నిబంధనలను కచ్చితంగా అమలు చేయనుంది:
 
1. కన్ఫర్మ్‌ టికెట్‌ లేని ప్రయాణికు కోసం ప్రయాణ నిబంధనలు:
వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్న ప్రయాణికులను ప్రయాణానికి అనుమతించరు మరియు రైళ్లలో జరిమానా చెల్లింపు ద్వారా టికెట్లు పొందడానికి లేదు.
అన్‌రిజర్వడ్‌ కోచ్ సౌకర్యం ఉన్న రైళ్లలోకి మాత్రమే అన్‌రిజర్వడ్‌ టికెట్లున్న ప్రయాణికులను అనుమతించబడుతారు.
 
2. రైళ్లలో క్యాటరింగ్‌ :
ప్రి పెయిడ్‌ క్యాటరింగ్‌ సౌకర్యం లేదు. టికెట చార్జీలో కార్యటరింగ్‌ చార్జీ జతచేయబడలేదు. రెడీ టు ఈట్‌ భోజనం మరియు ప్యాక్‌ చేసిన ఐటమ్ (వాటర్‌ బాటిళ్లతో సహా) మాత్రమే రైళ్లలో అందుబాటులో ఉంటాయి. ఐఆర్‌సీటీసీ ద్వారా  ఈక్యాటరింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

3. రైళ్లలో లెనిన్‌ దుప్పట్లు :
రైళ్లలో లెనిన్‌, దుప్పట్లు మరియు కర్టెన్లు అందజేయబడవు. ప్రయాణికులు వస్తువును స్వతహాగా తెచ్చుకోవాలి లేదా స్టేషన్లలోని స్టాళ్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. వాతావరణానికి  అనుగుణంగా ఏసీ కోచులో ఉష్ణోగ్రతు నియంత్రించబడుతాయి.
 
4. ప్రయాణికులకు ప్రవేశం మరియు ప్రయాణానికి సంబంధించి నిబంధనలు :
ప్రయాణికులందరూ స్టేషన్లలో మరియు ప్రయాణంలో కచ్చితంగా ‘‘ఫేస్‌ మాస్కును’’ ధరించాలి. సేష్టన్లలో మరియు ప్రయాణ సమయంలో వారు కచ్చితంగా ‘‘భౌతిక దూరాన్ని’’ పాటించాలి. ప్రయాణికులు ప్రయాణ సమయంలో సానిటైజర్లను వెంట తెచ్చుకోవాలి. వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లున్న ప్రయాణికులు రైల్వే స్టేషన్లలోకి అనుమతించబడరు.
 
థర్మల్‌ స్క్రీనింగ్‌లో లక్షణాలు లేని ప్రయాణికులు మాత్రమే ప్రయాణానికి అనుమతించబడుతారు.
గమ్య స్థానాలు రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలులో ఉన్న నిబంధనను కచ్చితంగా పాటించాలని ప్రయాణికులకు సూచించడమైనది.
 
ప్రయాణికులు ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాలని సూచించడమైనది. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా మనందరం సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రయాణికులు అందరూ బాధ్యతతో మెలగాలని మరియు సురక్షిత ప్రయాణం కోసం రైల్వే వారు తీసుకుంటున్న చర్యకు మద్దతు ఇవ్వాలని రైల్వే కోరుతుంది.