Daily Horoscope
✕

కరోనా నుంచి ఎస్కేప్- తెలంగాణలో 118 మంది డిశ్చార్జ్

Written By సెల్వి
Updated: బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:05 IST)
కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 20 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.

వైరస్ నిర్థారిత పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్రంలో పీపీఈ కిట్లకు ఏమాత్రం కొరత లేదని, 2.25 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయని వెల్లడించారు. కరోనాపై యుద్ధానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.
 
మరోవైపు తెలంగాణలో కొత్తగా బుధవారం నాడు ఆరు కరోనా వైరస్ కేసులు నమోదైనాయి. మరోవైపు ఎనిమిది కరోనా నుంచి కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ఫలితంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 118కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 514 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపోతే.. దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌లు వుంటే అందులో తెలంగాణలో 8 హాట్ స్పాట్లను గుర్తించారు. ఏపీలో 11 జిల్లాలు హాట్ స్పాట్‌లుగా ఉన్నాయి.

అన్నీ చూడండి

Ranabali Review: పోరాట యోధుడు రణబాలిగా జీవించిన విజయ్ దేవరకొండ - రణబాలి రివ్యూ

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

తర్వాతి కథనం
Show comments