బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (13:04 IST)

దేశంలో కొత్తగా మరో 7 వేల కరోనా పాజిటివ్ కేసులు

Covid test
దేశంలో కొత్తగా మరో 7830 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసులతో కలుపుకుంటే తాజాగా నమోదైన కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మొత్తం 7830 మందికి కరోనా వైరస్ సోకిందని తెలిపింది. దీంతో కలుపుకుంటే మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 40215కు చేరిందని వివరించారు. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క ఢిల్లీలోనే అత్యధికంగా 980 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు, రోజువారీ పాజిటివిటీ 3.65 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేట్ 3.83 శాతానికి చేరిందని అధికారులు పేర్కొన్నారు. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం (రికవరీ రేటు) 98.72 శాతానికి చేరుకుందని అన్నారు. వైరస్ తో మంగళవారం 11 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,31,016 కు చేరిందని తెలిపింది.