మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (10:23 IST)

40 మంది విద్యార్థినులకు కోవిడ్.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు

corona visus
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలోని కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో 40 మంది బాలికలు కరోనా వైరస్ బారినపడ్డారు. 'కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో ఒక విద్యార్థికి పాజిటివ్ పరీక్షించారు. ఆ తర్వాత, ఇతర విద్యార్థుల పరీక్షను నిర్వహించాం, అక్కడ 38 మంది విద్యార్థులు కోవిడ్ పాజిటివ్‌గా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించి తగిన చర్యలు తీసుకున్నాం. ఇక్కడ పని చేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా వైద్య పరీక్షలు చేస్తున్నాం. వీరందరూ ఇక్కడే ఉంటున్నారు అని లఖిపూర్ ఖేరీ సిఎంఓ డాక్టర్ సంతోష్ కుమార్ గుప్తా తెలిపారు.
 
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికిపైగా ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర మేల్కొని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇందులోభాగంగా, సోమవారం కూడా అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించనున్నారు. 
 
కాగా, గత ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో పెరుగుదల కనిపిస్తుండటం ఇదే ప్రథమం. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలను దిశానిర్దేశం చేసింది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. కాగా, ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వేరియంట్‌ను ఎక్స్ బీబీ 1.16గా శాస్త్రవేత్తలు గుర్తించారు.