ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మార్చి 2023 (10:32 IST)

కుక్కపై కర్కశత్వం.. మోటార్ సైకిల్‌‍కు కట్టి ఈడ్చుకెళ్లిన కిరాతకుడు

dog drag
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హృదయ విదాకర సంఘటన ఒకటి జరిగింది. ఓ శునకం పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తన మోటార్ సైకిల్‌కు కుక్కను కట్టిన ఓ వ్యక్తి కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఘజియాబాద్ జిల్లాకు చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ విహార్ ఔట్‌పోస్టు సమీపంలో తన మోటార్ బైకుకు కుక్కను తాడుతో కట్టేసి ఈడ్చుకెళ్లాడు. దీన్ని గమనించిన కొందరు స్థానికులు బైకులపై ఛేచ్ జేసి పట్టుకుని, పీపుల్స్ ఫర్ యానిమల్స్‌ ప్రతినిధులకు సమాచారం అందించారు. వారిచ్చిన ఫిర్యాదుతో ఆ వ్యక్తిపై పోలీసులు జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై నిందితుడు స్పందిస్తూ, కొన్ని రోజులుగా ఆ కుక్క అనేక మందిని కరిచిందని, అందుకే పట్టుకుని దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టే ప్రయత్నం చేశానని తెలిపారు. అయితే, స్థానికులు మాత్రం అతని మాటలను తోసిపుచ్చుతూ, ఆ కుక్క చాలా మంచిదని, ఎవరికీ ఎలాంటి హాని చేయలేదని చెప్పారు.