శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : సోమవారం, 16 మార్చి 2020 (13:28 IST)

కరోనా ఎఫెక్టు... ఖాళీగా దుబాయ్‌ ఎయిర్‌ పోర్టు

ఎప్పుడూ వేలాదిమంది ప్రయాణికులతో కళకళలాడే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్​ ఒక్క మనిషి కూడా లేకుండా ఖాళీగా కనిపించింది. కరోనా వైరస్​ కారణంగా అనేక దేశాల నుంచి విమాన సర్వీసులు రద్దు కావడం, యునైటెడ్​ అరబ్ ఎమిరేట్స్​ లో కూడా 85 కరోనా కేసులు రిజిస్టరవడంతో దుబాయ్​ ఎయిర్​ పోర్టుకు రాకపోకలు బాగా తగ్గిపోయాయి.

7,200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుబాయ్​ ఎయిర్​ పోర్టు ప్రపంచంలోనే బిజీ  విమానాశ్రయాల్లో మూడోది. ‘డీఎక్స్​బీ’ అని పిలిచే ఈ ఎయిర్​ పోర్ట్​ నుంచి వారానికి 7,700 విమాన సర్వీసులు నడుస్తుంటాయి. అరబ్ ప్రపంచంలో ఎక్కువ ప్రయాణాలు ఈ ఎయిర్​ పోర్టునుంచే జరుగుతాయి. ఎయిర్​ పోర్టు దాదాపుగా మూతపడినట్టే ఉండడంతో అక్కడ వందల సంఖ్యలో ఉన్న దుకాణాల్లో బిజినెస్​ కూడా సాగడంలేదు.
 
అమెరికా వీసా సర్వీసులు బంద్‌‌
కరోనా ఎఫెక్టుతో మనదేశంలోని అన్ని అమెరికా ఎంబసీలను, కాన్సులేట్లను మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. సోమవారం నుంచి అన్ని రకాల వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నామని, వీసా ప్రాసెస్‌లను రీషెడ్యూల్ చేసుకోవాలని అమెరికన్ ఎంబసీ కోరింది. తదుపరి నోటీస్ వచ్చేవరకు మిషన్ ఇండియా రెగ్యులర్ కాన్సులేట్‌‌ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

సోమవారం నుంచి న్యూఢిల్లీ, చెన్నై, కోల్​కతా, ముంబైలలోని ఆమెరికన్ సెంటర్లు ‘ఇన్ పర్సన్ ప్రోగ్రామింగ్’ ను మాత్రమే పాస్ చేస్తాయని తెలిపింది. మనదేశం నుంచి ముఖ్యంగా తెలుగురాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో స్టూడెంట్లు, ఉద్యోగులు అమెరికాకు వెళ్తుంటారు. వీసా కార్యకలాపాలు ఆగిపోవడంతో ప్రాసెస్​లో ఉన్న చాలా మంది ఇబ్బంది పడక తప్పదు.

మరోవైపు నౌకలకు కరోనా ఎఫెక్టు నేపథ్యంలో యూఎస్ పోర్టుల నుంచి ప్రధాన క్రూయిజ్ లైన్ల ప్రయాణాలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ‘నా రిక్వెస్ట్​ మేరకు కార్నివాల్, రాయల్ కరేబియన్, నార్వేయన్, ఎంఎస్సీ లాంటి అవుట్ బౌండ్ క్రూయిజ్ లను 30  రోజుల పాటు సస్పెండ్ చేసేందుకు అందరూ అంగీకరించారు’ అని ట్రంప్ శనివారం ట్వీట్ చేశారు.