0, 0, 0, 0, 0, 0: Bumrah అదుర్స్.. మెయిడెన్ ఓవర్‌తో అద్భుత రికార్డ్ (video)
Bumrah
ఇన్నింగ్స్ ఆరంభంలో బౌలింగ్ చేస్తూ, ఆరు బంతుల్లోనూ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా తన 13వ టీ20I మెయిడెన్ ఓవర్‌ను పూర్తి చేశాడు. తద్వారా 12 మెయిడెన్ ఓవర్లతో ఉన్న జింబాబ్వేకు చెందిన రిచర్డ్ న్గరావాను అధిగమించాడు.
అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఒక మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను బుమ్రా మెయిడెన్‌గా ముగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనతో ఆయన పొట్టి ఫార్మాట్లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
ఈ విలక్షణ ప్రదర్శనతో అంతర్జాతీయ టీ20లలో బుమ్రా వేసిన మొత్తం మెయిడెన్ ఓవర్ల సంఖ్య 13కు చేరింది. ఈ ఘనత బుమ్రాను టీ20I మెయిడెన్ ఓవర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలపడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్లోని అత్యంత చిన్న ఫార్మాట్లో అతని అసాధారణమైన ఎకానమీ, బౌలింగ్ నియంత్రణను చాటిచెప్పింది.
First 8(10) Runs - 1, 1, 0, 1, 1, 0, 0, 4, 0.
— VIKAS (@Vikas662005) September 15, 2026
Next 49(12) Runs - 4, 6, 4, 1, 4, 6, 4, 4, 6, 4, 6, W.
Sanju Samson bat with 260 SR ????????
Unbelievable hitting of Sanju Samson. ???? pic.twitter.com/LhXSWC5Ec8
