మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (17:33 IST)

నిన్న శ్రీలంక.. ఇపుడు జింబాబ్వే ... టీమిండియా టూర్స్ రద్దు

కరోనా వైరస్ కారణంగా భారత క్రికెట్ జట్టు తన విదేశీ పర్యటనలను రద్దు చేసుకుంటోంది. ఇప్పటికే శ్రీలంక పర్యటనను రద్దు చేసిన బీసీసీఐ ఇపుడు జింబాబ్వే పర్యటనను కూడా వాయిదా వేసింది.
 
కరోనా మహమ్మారి వల్ల క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యంకాకపోవడంతో షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఇందులోభాగంగా, తాజాగా జింబాబ్వే పర్యటనను కూడా రద్దు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. 
 
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ జట్టు.. శ్రీలంక, జింబాబ్వే దేశాల పర్యటనకు వెళ్లదని బీసీసీఐ శుక్రవారం స్పష్టంచేసింది. 
 
నిజానికి జూన్‌ 24 నుంచి టీమ్ ఇండియా లంక టూర్‌ వెళ్లాల్సి ఉంది. లంక పర్యటనలో భారత్‌ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అలాగ, ఆగస్టు 22న ప్రారంభంకావాల్సిన జింబాబ్వే టూర్‌లో భారత్‌ మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. కానీ, వీటిని రద్దు చేసుకున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో పేర్కొంది.