శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (19:52 IST)

ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ పోటీలు : బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ (video)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్‌ను నిర్వహించితీరుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ పోటీలు వాయిదాపడిన విషయం తెల్సిందే. ఇపుడు ఈ పోటీలను తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. 
 
ఇందులో భాగంగా ఐపీఎల్‌కు రెడీగా ఉండాలంటూ ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ చీఫ్ గంగూలీ లేఖలు రాశాడు. అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అదేసమయంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.
 
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే కనుక ఐపీఎల్ నిర్వహించాలని యోచిస్తున్నామని, అవసరమైతే ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నామని, అందువల్ల ఆయా ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆటగాళ్లు కూడా మ్యాచ్‌లు ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నారని అన్నాడు.