ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 మే 2020 (14:39 IST)

ఐపీఎల్ జరుగుతుంది.. కానీ స్టేడియాల్లో ప్రేక్షకులు ఉండరు : కుంబ్లే

భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైనా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. స్వదేశంలో జరగాల్సిన ఇడియన్ ప్రీమియర్ లీగ్ 11వ అంచె పోటీలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదాపడిన విషయం తెల్సిందే. అయితే, ఈ టోర్నీ ఈ యేడాది జరుగుతుందా లేదా అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.
 
ఎందుకంటే.. కరోనా వైరస్ కారణంగా అనేక అంతర్జాతీయ క్రీడా పోటీలు వాయిదాపడ్డాయి. అలాంటివాటిలో ఒకటి జపాన్ టోక్యో రాజధానిలో జరగాల్సిన ఒలింపిక్స్ పోటీలు కూడా ఉన్నాయి. దీంతో ఐపీఎల్‌పై కూడా నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ వాయిదా పడింది. 
 
ఈ ఏడాది జరుగుతుందా? లేదా? అనే అయోమయం సర్వత్ర నెలకొంది. ఈ ఏడాది అక్టోబర్ లో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుందని, ఆ నమ్మకం తనకుందని చెప్పారు. అయితే, స్టేడియంలలో మాత్రం ప్రేక్షకులు ఉండరని తెలిపారు.
 
మరోవైపు, అక్టోబరు, నవంబరు నెలల్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు కూడా వాయిదాపడ్డాయి. దీంతో ఈ రెండు నెలల వ్యవధిలో ఐపీఎల్ పోటీలు నిర్వహించే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.