శనివారం, 23 సెప్టెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (19:08 IST)

బాబర్ ఆజం.. ఒంటిమీద దుస్తులు లేకుండా.. ఆమెతో అలా చేస్తూ? (video)

babar azam
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంకు సంబంధించిన కొన్ని వీడియోలు, వాట్సాప్ చాట్‌లు, ఆడియో ఫైల్‌లు ఆన్‌లైన్‌లో 'లీక్' అయ్యాయి. ఈ విషయంపై బాబర్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ వీడియోల ద్వారా నెట్టింట చర్చ మొదలైంది. 
 
సోషల్ మీడియాలో షేర్ చేయబడిన బాబర్‌కి సంబంధించిన భారీ సంఖ్యలో వీడియోలు, చాట్‌లు మరియు ఆడియో ఫైల్‌లను చూసి, చాలా మంది అభిమానులు స్టార్ బ్యాటర్‌పై విరుచుకుపడ్డారు. తన సహచర ఆటగాడి గర్ల్ ఫ్రండ్‌తో చాట్ చేస్తూ వీడియో వైరల్ అయ్యింది. 
 
ఈ వీడియోలో ఒంటిమీద దుస్తులు లేకుండా ఉన్న బాబర్.. పాక్ జట్టులోని ఓ సభ్యుడి గర్ల్ ఫ్రెండ్‌తో అభ్యంతరకరంగా ఛాటింగ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తనకు కావాల్సింది ఇస్తే  తన ప్రియుడికి జట్టులో చోటు ఖాయం చేస్తానని బాబర్ ఆ వీడియోలో చెప్పినట్టు పలు ఆడియో ఫైల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. 
 
అయితే ఈ వీడియోలో ఉన్నది నిజంగా  బాబర్ ఆజామేనా..? లేక  ఎవరైనా కావాలని ఫేస్ మార్పింగ్ చేశారా..? అనేది ఇంకా తెలియరాలేదు. ఈ వీడియో పాక్ క్రికెట్‌ను ఓ కుదుపు కుదిపేసింది.