ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (08:48 IST)

విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేసిన పాకిస్థాన్ ఆటగాడు!

babar azam
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెర్ బాబర్ అజం సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీ20 మ్యాచ్‌లలో అమిత వేగంగా ఎనిమిదివేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగుతూ వచ్చిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. విరాట్ కోహ్లీ మొత్త 243 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, బాబర్ అజం మాత్రం 214 ఇన్నింగ్స్‌లలోనే ఎనిమిది వేల పైచిలుకు పరుగురు చేశాడు. 
 
గురువారం కరాచీ వేదికగా పర్యాటక ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బాబప్ చెలరేగి సెంచరీ (110 నాటౌట్) చేశాడు. దీంతో తన వ్యక్తిగత రికార్డును నెలకొల్పడమేకాకుండా, జట్టును కూడా గెలిపించాడు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో సం చేసింది. 
 
టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 203 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపును సొంతం చేసుకుంది. మరో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.