శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 అక్టోబరు 2015 (12:08 IST)

విరాట్ కోహ్లీ విఫలమైతే అనుష్కను తప్పుబట్టడం సరికాదు: నెటిజన్లు

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క చుట్టూ తిరగడంతోనే టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో కోహ్లీ తేలిపోవడానికి కూడా అనుష్కనే కారణమని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా దారుణంగా ఓడిపోవడం... కీలక బ్యాట్స్ మెన్ కోహ్లీ మెరవలేకపోవడంతో అనుష్కపై విమర్శలొచ్చాయి. 
 
ముంబై క్రికెట్ అసోసియేషన్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను నిషేధించడం కాదు... అనుష్క శర్మను బ్యాన్ చేయాలంటూ క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కానీ తాజాగా అనుష్క శర్మకు నెటిజన్ల నుంచి మద్దతు లభించింది.  ఇతర క్రికెటర్లకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని... వారు విఫలమయినప్పుడు వారి గర్ల్ ఫ్రెండ్స్ ను ఎందుకు నిందించడం లేదని నిలదీస్తున్నారు. కోహ్లీ విఫలమయినప్పుడల్లా అనుష్కను నిందించడం సరికాదని వారు అంటున్నారు. అనుష్క సినిమా ఫ్లాప్ అయినప్పుడు కోహ్లీని ఎందుకు తప్పుబట్టడం లేదని ప్రశ్నించారు.