ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (18:07 IST)

యువకుడా.. నచ్చావ్.. ధోనీని గుర్తు చేశావ్.. వీడియో వైరల్

Arjun soud
Arjun soud
నేపాల్ టీ20 లీగ్ నుంచి అద్భుతమైన స్టంపింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లీగ్‌లో బిరత్‌నగర్ సూపర్ కింగ్స్, జనక్‌పూర్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బిరత్‌నగర్ సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ అర్జున్ సౌద్ మెరుపు వేగంతో స్టంపింగ్ చేసి, జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేశాడు.  
 
తొలుత జనక్‌పూర్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ వాల్టన్ బంతిని డిఫెండ్ చేశాడు. బంతి దూరంగా వెళ్లడం చూసి పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. కానీ, ఫీల్డింగ్ చేస్తున్న సికందర్ రజా వికెట్ కీపర్ అర్జున్ సౌద్‌కు బంతిని ఇవ్వడంతో మెరుపు వేగంతో రనౌట్ చేశాడు. బంతి అర్జున్ సౌద్ నుంచి కొంచెం దూరం వెళ్లింది. 
 
ఆపై బంతిని గాలిలో ఎగురుతూ క్యాచ్ పట్టుకుని బ్యాట్స్‌మన్‌ను రన్ అవుట్ చేశాడు. ఈ స్టంపింగ్ పై కామంటేటర్ ప్రశంస వర్షం కురిపించాడు. ధోనీని గర్వపడేలా చేశావంటూ కితాబిచ్చాడు.