గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 మే 2017 (18:31 IST)

అర్జున్ టెండూల్కర్‌కు ఏమైంది? కర్రల సాయంతో బీబర్ షోకు వచ్చాడేంటి?

క్రికెట్ దేవుడు, టీమిండియా స్టార్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు ఏమైందని సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ చేతి

క్రికెట్ దేవుడు, టీమిండియా స్టార్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు ఏమైందని సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ చేతి కర్రల సాయంతో ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కెనడియన్ పాప్ స్టార్ జస్టిస్ బీబర్ షోకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. బీబర్‌ను చూసిన  వారంతో సచిన్ కుమారుడిలా ఉన్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 
 
బీబర్-అర్జున్ ఫోటోలు పెట్టి పోలికలు లేవని పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో బీబర్ షోకు అర్జున్ టెండూల్కర్ కూడా హాజరయ్యాడు. అయితే అర్జున్ చేతి కర్రల సాయంతో బీబర్ షోకు హాజరయ్యాడు. దీంతో సచిన్ అభిమానులు ఆందోళన చెందారు. ఇండియన్ బీబర్‌కు ఏమైంది? అంటూ సోషల్ మీడియాలో క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.