శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2015 (18:35 IST)

రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు: 29 టెస్టుల్లోనే 150 క్లబ్‌లో చేరిపోయాడు!

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును కైవసం చేసుకున్నాడు. ముత్తయ్య మురళీధరన్‌కు 150 వికెట్లు పడగొట్టడానికి 36 టెస్టులు కావాల్సి వచ్చాయి. అయితే అశ్విన్ కేవలం 29 టెస్టుల్లోనే 150 వికెట్ల క్లబ్‌లో చేరిపోయాడు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను కూల్చడంతో అశ్విన్ 150 వికెట్ల క్లబ్‌లో చేరాడు.
 
అంతకుముందు భారత్ బౌలర్ల తరపున అనిల్ కుంబ్లే, ఎర్రాపల్లి ప్రసన్నలు 34 టెస్టుల్లో 150 వికెట్ల క్లబ్‌లో చేరారు. అయితే ఈ ఫీట్‌ను అందుకోవడానికి అశ్విన్‌కు కేవలం 29 టెస్టులో అవసరమయ్యాయి. ఇక భారత్ తరపున వేగంగా 100 వికెట్లు సాధించిన ఘనత కూడా అశ్విన్ పేరిటే ఉంది.