తాగి తప్పుచేశా.. స్టీవ్ ఓకీఫ్ పశ్చాత్తాపం.. అయినా రూ.20వేల డాలర్ల జరిమానా
సిడ్నీలో జరిగిన ఓ క్రికెట్ కార్యక్రమంలో ఆస్ట్రేలియా టెస్టు క్రికెటర్ స్టీవ్ ఓకీఫ్ మద్యం మత్తులో నానా హంగామా సృష్టించాడు. 2014లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఓకీఫ్ 8 టెస్టుల్లో 33 వికెట్లు తీశాడ
సిడ్నీలో జరిగిన ఓ క్రికెట్ కార్యక్రమంలో ఆస్ట్రేలియా టెస్టు క్రికెటర్ స్టీవ్ ఓకీఫ్ మద్యం మత్తులో నానా హంగామా సృష్టించాడు. 2014లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఓకీఫ్ 8 టెస్టుల్లో 33 వికెట్లు తీశాడు. ఇతడు ఓ క్రికెట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తూ వస్తూ ఫూటుగా తాగాడు. ఆపై ఓవరాక్షన్ చేశాడు. అతడి విచక్షణా రహిత ప్రవర్తనకు గాను పోలీసులు 20వేల ఆస్ట్రేలియా డాలర్లను జరిమానాగా విధించారు. అంతేగాకుండా కౌన్సిలింగ్‌కు కూడా వెళ్ళాల్సిందిగా సూచించారు.
ఇదేవిధంగా గత ఏడాది కూడా ఓకీఫ్ సిడ్నిలోని ఓ హోటల్‌లో మద్యం సేవించి రచ్చ చేశాడని.. ఇలాంటి చర్యలను క్రికెట్ ఆస్ట్రేలియా ఉపేక్షించబోదని జనరల్ మేనేజర్ పాట్ హోవర్డ్ తెలిపారు. కాగా భారత్‌తో ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌లో అద్భుతంగా ఆడిన ఓకీఫ్.. మద్యం మత్తులో తప్పు చేశానని ఒప్పుకున్నాడు. తాగిన మైకంలో తాను అలా వ్యవహరించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనకు విధించిన జరిమానా చెల్లించడంతో పాటు కౌన్సిలింగ్‌కు వెళ్లేందుకు అంగీకరించాడు.