సంబంధిత వార్తలు
- ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా : తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్
- టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ... యావత్ భారతదేశ విజయం : సూర్యకుమార్ యాదవ్
- భారత క్రికెట్ జట్టుపై కాసుల వర్షం - రూ.131 కోట్ల నగదు బహుమతి
- Rajamouli: ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి షెడ్యూల్ అంటార్కిటికాలో - తాజా అప్ డేట్
- Summer holidays: తెలంగాణలో ఒంటి పూట బడులు.. షెడ్యూల్ ఇదే
ఐపీఎల్ 2026 సీజన్: రెండో దశ షెడ్యూల్ రిలీజ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గురువారం విడుదల చేసింది. ఇంతకుముందు తొలి దశలో కేవలం 20 మ్యాచులకు మాత్రమే వేదికలు, తేదీలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో దశలో 50 మ్యాచులకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో మొత్తం 70 లీగ్ మ్యాచులకూ షెడ్యూల్ ప్రకటించినట్లైంది.
అయితే, ప్లేఆఫ్స్ వేదికలను ఇంకా ఖరారు చేయాల్సివుంది. ఈ సీజన్ మార్చి 28 నుంచి మే 24 వరకూ జరగనుంది. లీగ్ స్టేజ్ మ్యాచ్‌ల వివరాలను ప్రకటించింది. బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌తో 19వ ఎడిషన్ ప్రారంభమవుతుంది. లీగ్ స్టేజ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో ముగియనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగనుంది.
