మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (14:28 IST)

ఇండో-పాక్ క్రికెట్ సంబంధాల్లో ఐసీసీ తలదూర్చదు: డేవ్ రిచర్డ్ సన్

ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్ జరగని విషయం తెలిసిందే. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలకు చెందిన మ్యాచ్‌లను అంతర్జాతీయ వేదికలపైనే ఆడిన దాయాది జట్లు స్వదేశాల్లో క్రికెట్ సిరీ

ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్ జరగని విషయం తెలిసిందే. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలకు చెందిన మ్యాచ్‌లను అంతర్జాతీయ వేదికలపైనే ఆడిన దాయాది జట్లు స్వదేశాల్లో క్రికెట్ సిరీస్ ఆడలేదు. ఈ నేపథ్యంలో భారత్‌ను పాకిస్థాన్‌లో పర్యటించేలా చేయాలని.. ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరగాలని డిమాండ్ పెరిగిపోతుంది. 
 
అయితే పాక్‌తో ఆడేందుకు భారత్ సుముఖత చూపలేదు. అయినా ఐసీసీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.. భారత్‌పై ఒత్తిడి తేవాలనే కొందరు చేస్తున్న డిమాండ్‌పై ఐసీసీ స్పందించింది. ఇండో-పాకిస్థాన్ క్రికెట్ సంబంధాల విషయంలో ఐసీసీ తలదూర్చదని, తటస్థంగానే వుంటుందని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్ సన్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ కంటే భారత్ క్రికెట్ వైపే ఐసీసీ ఆసక్తి చూపుతుందనే ఆరోపణలను ఆయన ఖండించారు.
 
తాము అన్ని దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండాలనే కోరుకుంటున్నామని.. ప్రస్తుతానికైతే భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులున్నాయని.. ఇరుదేశాల సంబంధాలపైనే క్రికెట్ ఆధారపడి వుంటుందన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు, భద్రత కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌పై తాము ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయబోమని రిచర్డ్ సన్ స్పష్టం చేశారు.