మంగళవారం, 4 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 1 మార్చి 2025 (19:49 IST)

చాంపియన్స్ ట్రోఫీ : ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన సఫారీలు - టార్గెట్ ఎంతంటే?

south africa - england
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, శనివారం గ్రూపు - బి జట్లు అయిన సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య నామమాత్రపు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. కరాచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
అయితే, సఫారీ బౌలర్ల ధాటికి ఆ జట్టు 38.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో సీనియర్ ఆటగాడు జో రూట్ చేసిన 37 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. చివర్లో జోఫ్రా అర్చర్ 25 పరుగులు చేయడంతో ఇంగ్లండ్‌కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. 
 
ఓపెనర్ బెక్ డకెట్ 24, కెప్టెన్ జోస్ బట్లర్ 21, హ్యారీ బ్రూక్ 19 చొప్పున పరుగులు చేశారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0), వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జెమీ స్మిత్ డకౌట్ కాగా, సఫారీ బౌలర్లలో మార్కో యన్సెస్ 3, వియాన్ ముల్దర్ 3, కేశవ్ మహరాజ్ 2, లుంగి ఎంగిడి 1, రబాడా 1 చొప్పున పరుగులు చేశారు.