మంగళవారం, 28 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 15 జూన్ 2017 (16:56 IST)

320 పరుగులకు పైనే ఉతికేట్లున్నారు... కోహ్లీ... ధోనీ సలహా తీసుకో...

ఛాంపియన్ ట్రోఫీ 2017 సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ బ్యాట్సమన్లు 2 వికెట్ల నష్టానికి 25 ఓవర్లలో 142 కొట్టారు. తమిమ్ ఇక్బాల్ దూకుడుగా ఆడుతున్నాడు. అతడు 72 బంతుల్లో 66 పరుగులతో కోహ్లికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అటువైపు రహీమ్ కూడా 58 బంతుల్లో 47 పరుగులతో క్

ఛాంపియన్ ట్రోఫీ 2017 సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ బ్యాట్సమన్లు 2 వికెట్ల నష్టానికి 25 ఓవర్లలో 142 కొట్టారు. తమిమ్ ఇక్బాల్ దూకుడుగా ఆడుతున్నాడు. అతడు 72 బంతుల్లో 66 పరుగులతో కోహ్లికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అటువైపు రహీమ్ కూడా 58 బంతుల్లో 47 పరుగులతో క్రీజులో వున్నారు. దీనితో ఇండియన్ క్రికెట్ క్రీడాభిమానులకు టెన్షన్ పెరిగిపోతోంది. 
 
ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా కోహ్లికి సలహాలు ఇస్తున్నారు. బంగ్లాదేశ్ బ్యాట్సమన్లను పెవిలియన్ పంపేందుకు ధోనీ సలహా తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. కోహ్లి మాత్రం అదేమీ చేయనట్లే కనిపిస్తున్నాడు. చూడాలి... బంగ్లా బ్యాటింగ్ ధాటి ఎంతవరకు వెళుతుందో...?