మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

భారత క్రికెటర్లకు డోప్ టెస్టులు : వాడా డిమాండ్

భారత క్రికెటర్లకు కూడా డోప్ పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) డిమాండ్ చేస్తోంది. దీంతో బీసీసీఐకు కొత్త చిక్కు వచ్చిపడింది. ఇప్పటికే ఐసీసీతో చర్చలు జరిపిన వాడా.. కొన్ని ప్రత్యేక

భారత క్రికెటర్లకు కూడా డోప్ పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) డిమాండ్ చేస్తోంది. దీంతో బీసీసీఐకు కొత్త చిక్కు వచ్చిపడింది. ఇప్పటికే ఐసీసీతో చర్చలు జరిపిన వాడా.. కొన్ని ప్రత్యేక సూచనలు చేసింది. 
 
బీసీసీఐ అనుమతితో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ ద్వారా భారత క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్ష నిర్వహించాలని సూచించింది. ఒకవేళ బీసీసీఐ ఇందుకు ఒప్పుకోకపోతే నాడా గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. వాడా అక్రిడేషన్‌ పొందిన నాడా గుర్తింపు రద్దు అయితే భారత క్రీడాకారులు ఎవరూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశమే ఉండదు. 
 
దీనిపై ఇప్పటికే వాడా కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌కు లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి లేఖ రాయాలని రాథోడ్‌ కేంద్ర క్రీడలశాఖ కార్యదర్శి శ్రీనివాస్‌కు ఆదేశాలు జారీ చేశారు. నాడాతో బీసీసీఐ కలిసి పని చేయాల్సిందిగా కోరుతూ లేఖ రాశారు.