సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 19 అక్టోబరు 2018 (11:59 IST)

అవునండి.. ఫిక్సింగ్‌ తప్పు చేశా.. క్షమించండి.. కనేరియా

పాకిస్థానీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా ఫిక్సింగ్ చేసిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో జట్టులో స్థానం కోల్పోవడమేకాక నిషేధానికి గురైన కనేరియా ఎట్టకేలకు తన తప్పును అంగీకరించాడు. అప్పుడున్న పరిస్థితుల్లో తన పరిస్థితిని అర్థం చేసుకుని క్షమించాల్సిందిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, అభిమానులు, ప్రజల్ని కోరుతున్నానని కనేరియా వెల్లడించాడు. 
 
61 టెస్టుల్లో 261 వికెట్లు తీసిన ఈ పాకిస్థానీ స్పిన్నర్‌ తన స్పిన్‌ మాయాజాంతో సొంత జట్టుకు ఎన్నో విజయాలు అందించి పెట్టాడు. 2010లో తన చివరి టెస్టు ఆడాడు. కానీ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో కనేరియాపై ఇంగ్లండ్‌ జట్టు జీవితకాల నిషేధం విధించగా, ఎసెక్స్‌ జట్టులో కనేరియా సహచరుడు మెర్విన్‌ వెస్ట్‌ఫీల్డ్‌ను జైలుకు పంపింది. ఈ ఆరోపణలపై కనేరియా తాజాగా స్పందించాడు.
 
ఫిక్సింగ్ మాట నిజమే అన్నాడు. ఆరేళ్ల పాటు ఏవేవో అబద్ధాలు చెప్తూ నెట్టుకు వచ్చానన్నాడు. ధైర్యం చేసుకుని నిజం చెప్తున్నానని తెలిపాడు. పెద్ద తప్పు చేశా.. క్షమించాల్సిందిగా అభిమానులను కోరాడు. బుకీ అనుభట్‌తో కలిసి చాలా పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అనుభట్‌కు దగ్గరవ్వడమే తాను చేసిన పెద్ద పొరపాటు, ఇలాంటి తప్పిదాలకు తావివ్వవద్దని యువ ఆటగాళ్లకు చెప్పడమే ఇకపై క్రికెట్‌కు నేను చేసే సేవ అని కనేరియా పేర్కొన్నాడు.