శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (19:07 IST)

గౌతమ్ గంభీర్ పాట పాడాడు.. వీడియోలో చూడండి..

భారత క్రికెటర్లు సినీ స్టార్లుగా, గాయకులుగా అవతారం ఎత్తడం కొత్తేమీ కాదు. కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ ఓ సినిమాలో హీరోగా నటించిన నేపథ్యంలో.. తాజాగా భార‌త స్టార్ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ గాయకుడిగా మారిపో

భారత క్రికెటర్లు సినీ స్టార్లుగా, గాయకులుగా అవతారం ఎత్తడం కొత్తేమీ కాదు. కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ ఓ సినిమాలో హీరోగా నటించిన నేపథ్యంలో.. తాజాగా భార‌త స్టార్ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ గాయకుడిగా మారిపోయాడు. గ‌తంలో హ‌ర్యానా జ‌ట్టు కోసం ఒలింపిక్ గ్ర‌హీత సాక్షి మాలిక్ కూడా జాతీయ గీతాన్ని పాడిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మొద‌టిసారిగా త‌న గొంతు స‌వ‌రించుకుని గంభీర్ జాతీయ గీతాన్ని ఆలపించాడు.
 
ప్రొ క‌బడ్డీ లీగ్ 2017లో ఆడుతున్న ఢిల్లీ జ‌ట్టు కోసం గంభీర్ ఈ పాట పాడాడు. రికార్డింగ్ స్టూడియోలో తాను పాడుతున్న వీడియోను గంభీర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పోస్టు చేశాడు. జాతీయ గీతం పాడుతుంటే రికార్డింగ్ థియేట‌ర్‌ కూడా దేశభ‌క్తిని ప్ర‌తిధ్వ‌నించింద‌ని గంభీర్ తన పోస్టులో తెలిపాడు. ఈ వీడియోను మీరూ చూడండి..