బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (13:38 IST)

అటువైపు ఎవరున్నా తగ్గేదేలే.. గౌతం గంభీర్

gambhir
టీమిండియా మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్-గౌతమ్ గంభీర్ ఇటీవల వార్తల్లో నిలిచారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023లో భాగంగా ఇటీవల సూరత్‌లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 
 
ఈ సందర్భంగా గంభీర్, శ్రీశాంత్ మైదానంలో ఒకరినొకరు వాగ్వాదానికి దిగారు. గంభీర్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడని శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సహచరులను ఎలా గౌరవించాలో గంభీర్‌కు తెలియదని ఆరోపించారు.
 
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, లక్నో సూపర్‌జెయింట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి ఘర్షణే చోటుచేసుకుంది. కోహ్లితో నవీనుల్ హక్, గంభీర్ వాగ్వాదానికి దిగారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. 
 
తాజాగా ఈ ఘటనపై గంభీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. మ్యాచ్ మధ్యలో జోక్యం చేసుకునే హక్కు తనకు లేదని, అయితే మ్యాచ్ ముగిసే సమయానికి వెళ్లి తన ఆటగాళ్లతో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అటువైపు ఎవరున్నా తగ్గేదేలే.. తమ ఆటగాళ్లను కాపాడుకోవడం తమ బాధ్యత అని తేల్చి చెప్పారు.