గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (17:26 IST)

రోహిత్‌ శర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్ (video)

ఇంగ్లండ్‌, టీమిండియా మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కూడా తడబడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను తక్కువకే ఆలౌట్‌ చేశామన్న ఆనందం లేకుండానే ఇంగ్లండ్‌ కూడా వెనువెంటనే వికెట్లు కోల్పోతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. 
 
ఓలీ పోప్‌ 27, జానీ బెయిర్‌ స్టో 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ కోహ్లి 50 పరుగులతో రాణించగా.. మిగతావారు విఫలమయ్యారు.
 
ఈ నాలుగో టెస్టులో రోహిత్‌ శర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ మలాన్‌ రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 
 
ఉమేశ్‌ వేసిన గుడ్‌లెంగ్త్‌ బంతిని అంచనా వేయడంలో మలాన్‌ పొరబడ్డాడు. బంతి మలాన్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకి స్లిప్‌లో ఉన్న రోహిత్‌ వైపు వెళ్లింది. 
 
రోహిత్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఒకవైపుగా డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. కాగా మలాన్‌ 31 పరుగులు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.