శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (18:19 IST)

ఆసియా జూనియర్‌ బాక్సింగ్ పోటీలు : రోహిత్‌కు స్వర్ణం

దుబాయ్‌ వేదికగా ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా 48 కేజీల విభాగంలో రోహిత్ చమోలి స్వర్ణ పతకాన్ని సాధించాడు. 
 
ఆదివారం జరిగిన పోటీలో మంగోలియాకు చెందిన ఒత్‌గోన్‌బయర్ తువ్‌సింజయాను ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. తొలి రౌండ్‌లో ఓడిపోయిన చమోలీ తర్వాత ర్యాలీ చేసి.. 3-2 తేడాతో విజయం సాధించాడు. ఈ విషయాన్ని బాక్సింగ్‌ ఫెడరేషన్ తన అధికారిక ట్విట్టర్‌ వేదికగా వెల్లడించి రోహిత్‌కు శుభాకాంక్షలు తెలిపింది.