ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (16:49 IST)

ఐసీసీ ర్యాంకుల పట్టిక : దిగజారిన విరాట్ కోహ్లీ ర్యాంకు

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం ఐసీసీ ర్యాంకుల పట్టికను విడుదల చేసింది. ఇందులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకు బాగా దిగజారిపోయింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 996 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేన్ విలియమ్సన్ 921 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 
 
ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లు, లబుషేన్ 878 పాయింట్లు, రోహిత్ శర్మ 773 పాయింట్లు, విరాట్ కోహ్లీ 766 పాయింట్లు, బాబర్ అజమ్ 749 పాయింట్లు, డేవిడ్ వార్నర్ 724 పాయింట్లు, క్వింటన్ డికాక్ 717 పాయింట్లు, నికోల్స్ 714 పాయింట్లతో టాప్-10లో ఉన్నారు.
 
కాగా ఈ ర్యాంకుల్లో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి రోహిత్ శర్మ 5వ స్థానంలోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న కోహ్లీ తన ర్యాంకును దిగజార్చుకుంటున్నాడు. మరోవైపు టీమ్ ర్యాంకుల్లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా రెండో స్థానంలో ఉంది.
 
బౌలర్ల ర్యాంకుల్లో ప్యాట్ కమిన్స్, అశ్విన్, టిమ్ సౌధీ టాప్-3 ర్యాంకుల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జాసన్ హోల్డర్, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, అశ్విన్, షకీబుల్ హసన్ టాప్-5 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.